దేశంలో 18 శాతం పెరిగిన చక్కెర ఉత్పత్తి.. అగ్రస్థానంలో ఈ రాష్ట్రం!

ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ISMA) ప్రకారం దేశంలో చక్కెర ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. జనవరి నాటికి ఉత్పత్తి 195.03 లక్షల టన్నులకు చేరి, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 515 చక్కెర మిల్లులు పనిచేస్తున్నాయి. షుగర్ ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ 42 శాతం వృద్ధితో 7.87 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి జరిగింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఉత్పత్తి పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్