పాకిస్తాన్లోని ఖైబర్ ఫఖుంఖ్వాలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో మరణాల సంఖ్య 31కి చేరింది. మృతుల్లో 16 మంది పోలీసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా దాక్కొని ఉన్న ఉగ్రవాదులతో కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (TTP)తో సంబంధం ఉన్న ఇత్తెహాద్-ఉల్-ముజాహిదీన్ పాకిస్థాన్ అనే మిలిటెంట్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది.