AP: అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు వద్ద రైలు కింద పడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు యాడికి మండలం పుప్పాలకు చెందిన ప్రత్యూషగా, కుమార్తెలు భావన (7), పల్లవి (4)గా గుర్తించారు. రైల్వే పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. వీరి మృతికి కుటుంబకలహాలే కారణమని సమాచారం.