అర్జెంటీనాలో దారుణం.. ఆందోళనకరంగా ఆత్మహత్యల సంఖ్య

అర్జెంటీనాలో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017లో 3,304 మంది ఆత్మహత్య చేసుకోగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,209కి పెరిగింది. ఇది దాదాపు 57 శాతం పెరుగుదల. 15 నుంచి 34 ఏళ్ల యువతలో రోడ్డు ప్రమాదాల కంటే ఆత్మహత్యలే ఎక్కువ ప్రాణాలు తీస్తున్నాయని భద్రతా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ఒంటరితనం, జూదం వ్యసనం వంటివి దీనికి కారణాలుగా చెబుతున్నారు. బాధిత కుటుంబాలు, ప్రజలు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అవగాహన కల్పించాలని, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕