సుకన్య సమృద్ధి యోజన.. ఇలా అప్లై చేయండి!

సుకన్య సమృద్ధి యోజన ఖాతాను మీకు సమీపంలోని పోస్టాఫీసులో లేదా ప్రభుత్వ/ ప్రైవేటు బ్యాంకుల్లో తెరవచ్చు. ఆడపిల్ల పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, తల్లిదండ్రులు/సంరక్షకుల గుర్తింపు కార్డు, పాన్ కార్డు అవసరం. బాలిక, తల్లిదండ్రుల పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు ఇవ్వాలి. దరఖాస్తుతో పాటు కనీస డిపాజిట్ మొత్తం రూ.250 చెల్లించాలి. పాప పేరు మీద రూ.10 లక్షలు నిధి కూడబెట్టాలనుకుంటే తొలి ఏడాది నుంచే నెలకు రూ.1,800 లేదా ఏడాదికి రూ. 20వేలు చొప్పున జమ చేయాలి. రూ.25 లక్షలు కావాలనుకుంటే నెలకు రూ. 4,500 లేదా ఏడాదికి రూ.52 వేలు చొప్పున జమ చేయాలి.

సంబంధిత పోస్ట్

✕
✕