సుకన్య సమృద్ధి పథకం మరో మైలురాయి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల కోసం అందిస్తున్న ఈ పథకం ఇప్పుడు ఇన్వెస్టర్లకు మంచి రాబడినిస్తోంది. ఇందులో వార్షిక పెట్టుబడి రూ.1.5 లక్షలు, 15 ఏళ్ల పెట్టుబడి కాలం, 21 ఏళ్ల మెచ్యూరిటీ కాలంలో ప్రస్తుత 8.20% వడ్డీ రేటుతో రూ.22.5 లక్షల పెట్టుబడికి రూ.49.32 లక్షల వడ్డీతో మొత్తం రూ.71.82 లక్షలు వస్తాయి. ఈ పథకం ప్రభుత్వ హామీతో రిస్క్ లేకుండా, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. పాప 10 ఏళ్లలోపు, నెలకు రూ.250తో కూడా ఖాతా తెరవవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువులకు 50% విత్‌డ్రా చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్