దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి తన తొలి చిత్రమైన గాంధీ తాత చెట్టు కోసం గుండు కొట్టించుకొని నటనలో ధైర్యాన్ని చూపింది. ఈ సినిమాకి గానూ ఆమెకు 71వ నేషనల్ అవార్డుల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది. ఈ చిత్రం 2025 జనవరిలో విడుదలైంది. ఇప్పటికే దేశ, విదేశాల్లో ఈ సినిమా అనేక అవార్డులు గెలుచుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఓటీటీలలో అందుబాటులో ఉంది.