AP: సమ్మర్ హాలీడేస్ కారణంగా తిరుమలకు శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోగా, బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 74,286 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 33,186 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు నమోదైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.