రెండు భాగాలుగా సందీప్ కిషన్ 'కరికాల'!

ఇటీవల 'సూపర్ సుబ్బు'తో ఓటీటీలో అలరించిన తెలుగు హీరో సందీప్ కిషన్.. తమిళనాడు CM విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సిగ్మా'లోనూ నటించారు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా మరో సినిమాను ప్రకటించాడు సందీప్ కిషన్. దర్శకుడు యుగంధర్ మునితో కలిసి 'కరికాల' అనే కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం వచ్చే ఏడాది జూలై 2న, రెండో భాగం అక్టోబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నారని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్