సూపర్ ఎల్‌నినో.. లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు!

వాతావరణ మార్పుల వల్ల సూపర్ ఎల్‌నినో ప్రభావంతో సెప్టెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 మధ్య ప్రపంచవ్యాప్తంగా 2,39,000 మంది అదనంగా మరణించే అవకాశం ఉందని చికాగో యూనివర్సిటీ క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. భారత్‌లో 15,800 మంది ప్రాణాలు కోల్పోతారని, అందులో 7,400 మంది వడగాల్పుల వల్ల డిసెంబర్ 2026 - ఫిబ్రవరి 2027 మధ్య మరణిస్తారని అంచనా. ప్రభుత్వాలు తక్షణమే మేల్కొని, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కూలింగ్ సెంటర్లు, హైడ్రేషన్ స్టేషన్లు, హీట్ యాక్షన్ ప్లాన్స్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕