ఏప్రిల్ నెలలోనే ఏపీలో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది మే 25 తర్వాత ఉండే రోహిణీ కార్తె స్థాయి వేడి. శాస్త్రవేత్తలు దీనిని ప్రపంచ వాతావరణాన్ని అతలాకుతలం చేయబోతున్న 'సూపర్ ఎల్‌నినో' రాకకు సంకేతంగా భావిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఎల్‌నినో ఏర్పడుతుంది. ఇది భూమి వాతావరణ చక్రాలను దెబ్బతీస్తుంది. సూపర్ ఎల్‌నినో వల్ల భారతదేశంలో రుతుపవనాలు బలహీనపడి, కరువు కాటకాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు నీటిని పొదుపు చేయాలని, తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.