కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ద్వారా ప్రతి నెలా రూ.5,550 పొందవచ్చు. ఈ స్కీమ్‌పై వార్షికంగా 7.4 శాతం వడ్డీరేటు అందిస్తున్నారు. ఈ వడ్డీని నెలవారీగా చెల్లిస్తారు. రూ.9,00,000 పెట్టుబడి పెడితే 7.4 శాతం వడ్డీరేటుతో నెలకు రూ.5,550 పొందవచ్చు. ఈ పథకం గడువు 5 సంవత్సరాలు. గడువు పూర్తయిన తర్వాత మీరు డబ్బు తీసుకోవచ్చు. లేదా మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు.