డిజిటల్ యుగంలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం, అలవాట్లు పాటించడం అవసరం. విటమిన్ A, ల్యూటిన్, జియాక్సాంతిన్, విటమిన్ E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ C అధికంగా ఉండే క్యారెట్లు, ఆకుకూరలు, నట్స్, సిట్రస్ పండ్లు వంటివి కంటి చూపును మెరుగుపరుస్తాయి. స్క్రీన్ టైమ్ తగ్గించడం, 20-20-20 రూల్ పాటించడం, తగినంత నిద్ర, సన్ గ్లాసెస్ వాడటం, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం వంటి చిట్కాలు కంటి వెలుగును కాపాడతాయి.