కంటి చూపును మెరుగుపరచుకోవడానికి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్-ఏ (క్యారెట్లు, పాలకూర), లుటీన్, జియాక్సాంథిన్ (గుడ్లు, బ్రకోలీ) తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (చేపలు, వాల్‌నట్స్), విటమిన్-సి, విటమిన్-ఈ, జింక్ (సిట్రస్ పండ్లు, బాదం) వంటి పోషకాలు కంటి చూపును అద్దాల్లా స్పష్టంగా ఉంచడంలో సహాయపడతాయని అంటున్నారు.