ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై సుప్రీంలో విచారణ

ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 42 మంది లోక్‌సభ ఎంపీలపై క్రిమినల్‌ కేసులున్నాయని.. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్‌ క్యూరీ తన నివేదికలో పేర్కొన్నారు. SC స్పందిస్తూ.. క్రిమినల్‌ కేసులుంటే ఉద్యోగంలో చేరేందుకే అనర్హులని.. అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం, CECకి నోటీసులు జారీ చేస్తూ విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్