సుప్రీం కోర్టు తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది: దాసోజు

TG: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని MLC దాసోజు శ్రవణ్ విమర్శించారు. స్పీకర్ ఆత్మ సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవాలి కానీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని SC ఆదేశించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్