సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు, పెదనాన్న సురవరం ప్రతాపరెడ్డి ప్రముఖ కవి. ఆయన హైస్కూల్, అండర్ గ్రాడ్యుయేట్ చదువును ఏపీలోని కర్నూలులో పూర్తి చేశారు. ఆ తర్వాత 1967లో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. చదువుకునే రోజుల్లోనే సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు.