ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం

ఉత్తర అండమాన్ సముద్రంలో ఈ నెల 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 13 నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడనం, 15 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండం ఏర్పడనుంది. దీంతో శనివారం అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕