సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన

బుధవారం మధ్యాహ్నం పెన్ పహాడ్ మండలంలోని గాజుల మల్కాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కనకాంబర చారి చిన్నకుమారుడు నిఖిల్, స్నేహితులతో కలిసి తాటి ముంజలు కోయడానికి ఐరన్ పైప్ తీసుకెళ్లగా, అది 11 కెవి హై టెన్షన్ కరెంటు వైర్పై పడింది. దీంతో నిఖిల్ తీవ్ర విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామస్తులు, కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పెన్ పహాడ్ పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్