వలిగొండ మండలంలోని గొల్నెపల్లి గ్రామానికి చెందిన గాదే ప్రవల్లిక (20) అనే యువతి, కుటుంబ కారణాల వల్ల ఇతరులు మందలించడంతో మనస్తాపానికి లోనై, బీబీనగర్ మండల పరిధిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతురాలి బంధువులు శుక్రవారం మృతదేహంతో నిరసన తెలిపి, మృతికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్సై యుగంధర్ గౌడ్ హామీతో నిరసన విరమించారు.