భువనగిరి: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం రాత్రి వివాహిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మీనాయుడు తన భార్య లలిత(30), ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చిన లక్ష్మీనాయుడు భార్యతో గొడవ పడగా, మనస్తాపానికి గురైన లలిత గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్