యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట గురుకుల కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇంటర్ విద్యార్థులు ఆరుగురు పదవ తరగతి విద్యార్థులపై క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ర్యాగింగ్ ఘటన బయటకు రాకుండా హాస్టల్ యాజమాన్యం లోలోపల ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు సమాచారం.