యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున మద్యం మత్తులో హైవే పై నుంచి సర్వీస్ రోడ్డు పైకి పడిపోయిన ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శాతాపురం పాలకుర్తికి చెందిన గన్న ఆనంద్, తిరుమలగిరికి చెందిన భూతల రాకేష్. గాయపడిన మరో వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.