భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని వాహనాల పార్కింగ్ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు చెట్లకు కూడా అంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.