యాదాద్రి జిల్లా భువనగిరి మండలం మన్నెవారి పంపు గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. తనిఖీలలో సామల సత్తిరెడ్డి తన ఇంటి వద్ద కల్తీ పాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గురువారం పోలీసులు తెలిపారు. 80 లీటర్ల కల్తీ పాలు, 5 కిలోల ధోల్పూర్ ఫ్రెష్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ పాకెట్లు, 500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 400 మిల్లీలీటర్ల ఎసిటిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు.