శారాజిపేట గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఉప సర్పంచ్ శ్రీధర్కు చెందిన ఆవును పులి చంపేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలో డప్పు చాటింపు వేయించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పశువుల పాకల వద్దకు వెళ్లవద్దని సూచించారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పులిని బంధించి తమ ప్రాణాలను, పశువులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.