యాదాద్రి: పాముకాటుతో మహిళ మృతి

పాము కాటుతో మహిళా కూలీ మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం వెంకిర్యాలలో బుధవారం చోటు చేసుకుంది. బీబీనగర్ సీఐ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాయరావుపేటకు చెందిన గంగాధరి ఉమ (49) భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి మండలంలోని రహీం ఖాన్ గూడలో ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటుంది. బుధవారం వెంకిర్యాలలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

సంబంధిత పోస్ట్