బైక్ డిక్కీ నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు చోరీ చేసిన ఘటన బుధవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం రాoదాసు అనే వ్యక్తి తన స్నేహితుడిని కలిసేందుకు నాగార్జున స్కూల్ కు వచ్చాడు. ద్విచక్ర వాహనాన్ని పార్కు చేసి మిత్రుడితో మాట్లాడేందుకు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తి డిక్కీలో దాచిన 1,93,000 నగదును అపహారించుకుపోయాడు. చోరీ దృశ్యాలు సిసి కెమెరాలు రికార్డయ్యాయి.