యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ జరుగుతోంది. ఈ సందర్భంగా ఉదయాన్నే యాదాద్రికి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు నిండిపోయాయి. ప్రసాద విక్రయ విభాగంలో సందడి నెలకొంది. వాహనాల రాకపోకలతో ఆలయ దారులు నిండిపోయాయి. స్వామివారికి నిత్య ఆరాధనలు, కల్యాణం, సేవా పర్వాలు చేశారు.