యాదాద్రి జిల్లా మోత్కూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని, పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మండలంలోని అనాజిపురంకి చెందిన రైతు కుమ్మరికుంట్ల శేఖర్ రెడ్డి తన బోరు పక్కనే మరో రైతు బోరు వేశాడని దీంతో తన బోరు ఎండిపోయిందని వాల్టా చట్టానికి విరుద్ధంగా తన బోరు పక్కనే బోరు వేసిన రైతుపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు.