యాదాద్రి: అనిశాకు చిక్కిన ఈఈకి రిమాండ్

యాదగిరిగుట్ట దేవస్థానం ఎలక్ట్రికల్ ఈఈ ఊడేపు వెంకటరామారావును లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఆలయ లడ్డూ తయారీ యంత్రానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు గుత్తేదారు నుంచి 20 శాతం లంచం డిమాండ్ చేయగా, రూ.1.90 లక్షలకు బేరం కుదిరింది. ఫిర్యాదు అందిన వెంటనే నిఘా పెట్టిన ఏసీబీ, బుధవారం మేడారం జాతర నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లోని మేడిపల్లిలో మందుల దుకాణం వద్ద నగదు తీసుకుంటుండగా వలపన్ని పట్టుకుంది. అనంతరం ఆయన కార్యాలయం, నివాసంలో సోదాలు నిర్వహించి, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 23 మంది అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్