యాదాద్రి: చిల్లాపురం వద్ద పత్తి లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురం శివారులో గురువారం ఉదయం పత్తి లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం లింగోటం గ్రామం నుండి వరంగల్ లోని మిల్లుకు పత్తిని తరలిస్తుండగా, చిల్లాపురం శివారులో మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇరుకైన రహదారి కూడా ప్రమాదానికి కారణమైంది. అదృష్టవశాత్తు డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు.

సంబంధిత పోస్ట్