యాదాద్రి: ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని పిల్లాయిపల్లి గ్రామ శివారులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ డ్రమ్ములతో వెళ్తున్న టిప్పర్ లోడర్ వాహనం అదుపుతప్పి లోయలో పల్టీ కొట్టడంతో ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నిరంజన్ (21), సతీష్ కుమార్ (22) అనే ఇద్దరు వలస కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. శివగంగ అగ్రిగేట్స్ క్రషర్ లో వీరు పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్