యాదాద్రి: భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా, దేశముఖి గ్రామంలో ఈ నెల 6న రాత్రి, కాలేజీకి వెళ్లడం లేదని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఇంటర్ విద్యార్థి గోపీశంకర్ (17) హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్