నల్గొండ మిర్యాలగూడ రోడ్డులో హ్యాపీ హోమ్స్ సమీపంలో ఏప్రిల్ 26, 2026న అదుపుతప్పిన బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు నల్గొండ 108 అంబులెన్స్ సిబ్బంది రవి, వెంకటయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. రక్తస్రావాన్ని అరికట్టి, మెరుగైన చికిత్స కోసం బాధితులను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.