దేవరకొండ ఎస్టి గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం రాత్రి చికెన్, సోమవారం ఉదయం పులిహోర తిన్న15 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘాల నేతలు పరామర్శించారు. గురుకులాల్లో గత కొంతకాలంగా ఫుడ్ పాయిజన్లు జరుగుతున్న పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులను పరామర్శించిన వారిలో విద్యార్థి, గిరిజన సంఘాల నేతలు ఆంజనేయులు, వెంకటేష్, బాబురాo, రమేష్ తదితరులు ఉన్నారు.