దేవరకొండ: ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

దేవరకొండ మండల పరిధిలోని ముదిగొండ ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 20 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం బొబ్బర్లు, రాత్రి చికెన్ భోజనం, ఉదయం పులిహోర తిన్న విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడుతుండటంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉంది.

సంబంధిత పోస్ట్