కొండమల్లేపల్లి మండలంలోని బాపూజీ నగర్ యూ టర్న్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు దమ్మోజు ఆంజనేయ చారి (37) మృతి చెందాడు. తాటికోల్ గ్రామానికి చెందిన అతను బంధువుల పనిమీద కొండమల్లేపల్లికి వచ్చి తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎస్‌ఐ అజ్మీరా రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.