డిండిలో వ్యక్తి మృతి

డిండి మండల కేంద్రంలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, గుర్తుతెలియని వ్యక్తి ( 65) నెల రోజుల నుండి డిండి సాయిబాబా ఆలయం, బేకరీ వద్ద యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం 6 గంటలకు ప్రవీణ్ రెడ్డి వైన్స్ దగ్గర చనిపోయి ఉన్నాడు. కేసు నమోదు చేసి శవాన్ని దేవరకొండ మార్చరీలో భద్రపరిచారు. గుర్తించిన వారు 112 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕