నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుడ్డ తండాకు చెందిన మూడవత్ రమేష్ అనే వ్యక్తి రోడ్డు పక్కన నిద్రిస్తుండగా, నియంత్రణ కోల్పోయిన డీసీఎం వాహనం ఆయనపైకి దూసుకువచ్చింది. ఈ దుర్ఘటనలో రమేష్ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.