నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో, ఉప్పవాగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 10వ తరగతి చదువుతున్న శ్రీనివాసచారి, కార్తికేయన్ అనే ఇద్దరు విద్యార్థులు హోలీ ఆడుకునేందుకు బైక్ పై వెళ్తుండగా, ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొన్నారు. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.