సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (బయోసైన్స్)గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఎండ్ల నాగమణి, ఆమె భర్త జనార్దన్ రెడ్డిలను PRTU TS మఠంపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోదుగు శేషి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల రామకృష్ణ, మండల అధ్యక్షులు కందరబోయిన లింగారావు, అసోసియేట్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేశ్వర్లు, మహిళా ఉపాధ్యక్షులు బైరెడ్డి రాధమ్మ, మహిళా కార్యదర్శి మోదుగు మమత, సీనియర్ సభ్యులు కట్టా మాధవి, వసంత లక్ష్మి, కొండ ఆంజనేయులు పాల్గొన్నారు.