హుజూర్‌నగర్ పట్టణంలోని రెండో వార్డుకు చెందిన జక్కుల కల్యాణికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 45 వేల చెక్కును మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు, వార్డు కౌన్సిలర్ కోడి జ్యోతి ఉపేందర్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పేదలకు వైద్య సహాయం అందించడంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిట్యాల అమర్నాథ్ రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.