హుజూర్ నగర్ లో చలివేంద్రం, మజ్జిగ పంపిణీ ప్రారంభం

సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియోజకవర్గంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ సెంటర్ వద్ద చలివేంద్రం, మజ్జిగ ప్యాకెట్ల ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఛైర్మెన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మెన్ తన్నీరు మల్లికార్జున్ రావ్, కౌన్సిలర్ల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం, పట్టణానికి వచ్చే గ్రామీణ ప్రజలకు, స్థానికులకు దాహార్తిని తీర్చడంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న ఈ చర్య ప్రశంసనీయం.

సంబంధిత పోస్ట్