చింతలపాలెం: ఆంధ్ర తెలంగాణ మత్స్యకారుల మధ్య వివాదం

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేపల్లె గ్రామంలో ఆంధ్ర, తెలంగాణ మత్స్యకారుల మధ్య వివాదం నెలకొంది. గత పది రోజులుగా ఈ సమస్య కొనసాగుతోంది. తెలంగాణ మత్స్యకారులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో అధికారులు రేపల్లె గ్రామాన్ని సందర్శించి, స్థానికుల వివరాలను సేకరించారు. ఆంధ్ర వర్గం అందుబాటులో లేకపోవడంతో, ఈ సమస్యపై మంగళవారం మత్స్యకార ఏడి సమక్షంలో సమావేశం నిర్వహించి, పరిష్కారం కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్