సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత...

హుజూర్‌నగర్ పట్టణంలోని రెండో వార్డు మల్లన్ననగర్‌కు చెందిన లక్ష్మమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 34 వేల చెక్కును రెండో వార్డ్ కౌన్సిలర్ కోడి జ్యోతి ఉపేందర్ యాదవ్ లబ్ధిదారురాలికి అందజేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని కౌన్సిలర్ తెలిపారు. లబ్ధిదారురాలు లక్ష్మమ్మ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ కోడి జ్యోతి ఉపేందర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్