త్వరలో ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌసింగ్ కాలనీని ప్రారంభించనున్న సీఎం రేవంత్ ?

హుజూర్‌నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ బుధవారం పరిశీలించారు. ఈ కాలనీని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్, వీధిదీపాలు, తాగునీరు, గ్రీనరీ, సభాస్థలి వంటి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు.

సంబంధిత పోస్ట్