విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సందర్శించిన కలెక్టర్

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు పరిశోధనలకు నాంది పలకాలని అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించిన ఆయన, ఈ ప్రదర్శనలతో విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రయోగాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్ కుమార్, ఎంఈఓలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్