సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కండిబండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ కొంత కాలంగా ఇలాగే చెత్త చెదారంతో నిండి ఇళ్ల ముందు ప్రవహిస్తూ ఉన్నది. ఈ డ్రైనేజీలో ఉన్నటువంటి చెత్తాచెదారం తీసివేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్య వల్ల మురుగు నీరు బయటికి పోవడానికి అవకాశం లేక అక్కడక్కడ నిలిచిపోతుంది. దోమలు పెరిగి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ డ్రైనేజీ సమస్యను తీర్చమంటూ సంబంధిత అధికారులకు గ్రామస్తులు తెలియజేస్తున్నారు.