హుజూర్‌నగర్‌లో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మతపెద్ద ముఫ్తి మొహమ్మద్ గౌస్ ఉద్దీన్ ఆధ్వర్యంలో బక్రీద్ విశిష్టతను వివరించారు. ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌ను దేవుని ఆజ్ఞ మేరకు బలి ఇవ్వడానికి సిద్ధపడిన త్యాగ స్మరణగా ఈద్-ఉల్-అధా పండుగను జరుపుకుంటారని, ఖుర్బానీ ద్వారా మాంసాన్ని పేదలకు పంపిణీ చేయడం దాతృత్వానికి ప్రతీక అని తెలిపారు. అధికారులు, పోలీసులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.